గంపలో వధువు
Gampalo Vadhuvu
Telugu Marriage Tradition : Gampalo Vadhuvu –
కొత్తగా అల్లిన వెదురు గంపకు పసుపు కుంకుమలతో అలంకరిస్తారు అందోల ధాన్యం, బియ్యం, పోసి గౌరి పూజ చేసిన వధువును ఆ గంపలో కూర్చోబెట్టి పెండ్లి మండపంలోకి తీసుకొస్తారు
ఆమె మేనమామలు ఇది తెలుగు వారి ఆచారం. వధువును వివాహ మాడే హక్కు మేనమామకు, లేదంటే ఆయన కొడుకుకు గానీ ఉండేది. ఆ మేనమామ సమ్మతితోనే వివాహం జరుగుతుందని అనడానికి గుర్తుగా ఆయనే స్వయంగా వధువును తెచ్చి కన్యాదానం చేయిస్తాడు. ఆ సమయంలోనే మేనమామకు మగ పెండ్లివారు దుస్తులు (సారే) పెట్టి సత్కరిస్తారు.
కొబ్బరిబోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని–సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడా ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. ఈ తంతును పాలగంప అని కూడా అంటారు.
వివాహవేడుకలో పెళ్ళికొడుకును విష్ణుమూర్తిగాను, పెళ్ళికూతురును లక్ష్మీదేవి గాను భావిస్తారు. పెళ్ళికూతురు గౌరీపూజ చేసిన తరువాత ఆమెను లక్ష్మీదేవిగా భావించి ఆమె మేనమామలు వెదురుబుట్టలో మోసు కువస్తారు. పూజ తరువాత లక్ష్మీదేవి నేలపై నడకూడదని భావించి అలా మోసుకువస్తారు.
ఇంకొక ప్రాచీన కారణం ప్రకారం పాతకాలంలో నేల గరుకుగా, రాళ్ళు గుచ్చుకునేలా ఉండడం వల్ల, పెళ్ళికూతురు గాయపడకుండా ఉండడానికి, గౌరి పూజ తరువాత ఆమెను అలా గంపలో తీసుకువస్తారని వ్యవహారంలో ఉంది.