పుట్టిన రోజు వేడుక

First Birthday celebration

Telugu Tradition : First Birthday celebration – కావలసినవి : ఈనాటి పరిస్థితులకు అనుకూలంగా, డ్రస్సు, కేకు, వెండి మైనపు వత్తి, వెండి చాకు, బంగారు వస్తువులు మొదలగు సామాగ్రిని సమకూర్చుకోవాలి. ముందుగా (పాపబాబు) కుర్చీలో కూర్చుండపెట్టి, హారతి పట్టవలెను. తరువాత కేకు కటింగు చేయిం చాలి. అతిధులకు బొట్టు పెట్టి పండు, తాంబూలము, స్వీటు, హాటు, బహుమతి సామాను, కవరులో వేసి వేడుకకు వచ్చిన వారు వెళ్ళు సమయంలో వారికి ఇవ్వవలెను. స్తోమత కల్గినవారు విందు భోజనము గాని, టిఫినుకానీ ఏర్పాటు చేయవచ్చును. ముత్తయిదువులకు కాళ్ళకు పసుపురాసి పండు, తాంబూలము ఇవ్వవలెను.

 



ప్రథమ జన్మదిన వేడుకలతో తమ ముద్దుల మనవడు లేక మనవరాలు చేసిన అల్లర్లకు క్రింది వస్తువులను ఇచ్చి గౌరవిస్తారు.

అచ్చట్లు ముచ్చట్లు

మనవరాలిగా పుట్టినందుకు మరమరాలు

ముద్దుగా ఉన్నానని ముద్దకోవా

చిరునవ్వులకు చిప్స్

అల్లరి చేస్తున్నానని చిల్లర

గోలచేస్తున్నానని గోలీలు

దూకుడుకు దువ్వెనలు 

కేరింతలు కొడుచున్నానని ఈలలు
కేకలకు కేకులు

చలాకిగా ఉన్నందుకు చాక్లెట్లు 

బిజీగా ఉన్నందుకు బిస్కెట్లు 

పచ్చని రంగని పచ్చని పండ్లు
అడుగులకు అరిసెలు

పేచీలు పెడుచున్నాని పెన్నులు

బొంగరంలా తిరుగుతున్నాని బొంగరాలు

బుడిబుడి నడకలకు బూరెలు

పారాడుచున్నానని పాపిడి ముక్కలు

మారాం చేస్తున్నాని మామిడిపండ్లు

ఆడుకుంటున్నాని అటుకులు

సైగలు చేస్తున్నాని సైకిలు

కూర్చుంటున్నాని కుర్చీలు

కోరలు వచ్చాయని కొబ్బరి బోండాలు

మాట్లాడుచున్నాని మణుగు బూరెలు

గడపదాటుచున్నాని గారెలు

 

Also Read : 8-12 వ నెలలలో వేడుకలు

Leave A Reply

Your Email Id will not be published!