నిశ్చితార్థం
Engagement Process
Telugu Marriage Process : Engagement Process – నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణీత కాల వ్యవధిలో వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్ప చుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్దానం ద్వారా నిశ్చయిం చుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రి యకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం.
నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్ళి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంటలోని అబ్బాయిని పెళ్ళి కుమారుడు అని అమ్మాయిని పెళ్ళి కుమార్తె అని వ్యవహరి స్తారు. “మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాము” అని అంగీకారము తెలిపి “ధ్రువంతే రాజా” అనే వేదమంత్రముల పఠనముతో వధువునకు నూతన వస్త్రములు, నగలు మొదలైనవి ఇచ్చి వధువుచే ధరింపచేసి, పూలు పండ్లు పళ్లెములో పెట్టి నుదుట కుంకుమ అలంకరించి “శీఘ్రమేవ వివాహ సిద్ధిరస్తు!” అని అమ్మాయి చేతిలో పూలు పండ్లు పెట్టి ఆశీర్వదించాలి. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్న పత్రికగా వ్రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకొంటారు. తరువాత బంధుమిత్రులకు చందన తాంబూలముల నిచ్చి గౌరవించి వారి ఆశీర్వాదములు పొందవలెను. దీనినే నిశ్చయ తాంబూలమని, నిశ్చితార్థమని అంటారు. ఈ వేడుక ఒక అగ్రిమెంటు లాంటిదని భావించవచ్చును. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చు కోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. ఇరుపక్షాల వాళ్ళు మరిచి పోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి పుచ్చు కోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.
నిశ్చితార్థమునకు ముహూర్తము
నిశ్చితార్ధముకు పెండ్లితో సమానమయిన, సమాన బలమయిన ముహూర్తం చూడవలెను. కారణం నిశ్చితార్ధంతోనే వధూవరుల బంధం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా జాతక ప్రభావాలు వారిరువురికీ ఒకరి ప్రభావం మరొకరిమీద ఈ మూహూర్తం నుండే ప్రారంభం అవుతాయి. వివాహమునకు సంబంధించిన తిథి వార నక్షత్ర లగ్నములు చూడవలెను. అయితే నిశ్చితార్ధం రోజున గణపతి పూజ చేయవలెను. భోజనానంతరం పూజ పనికిరాదు. కావున ఉదయ సమయంలోనే నిశ్చితార్ధం చేయవలెను అని చెబుతారు.