ఎలుగుబంట్ల వేషాలు

Elugubantla Vesham

Telugu Tradition : Elugubantla Vesham –

పూర్వం ఎలుగుబంట్ల వేషాలు ఎక్కువగా సంబరాల్లోనే కనిపిస్తాయి. ఇద్దరు రెండు ఎలుగు బంట్లుగా చెక్కతో చేసిన ఎలుగుబంటి ముఖాలను తమ ముఖాలకు తగిలించుకొని, ఎలుగుబంటి వెంట్రుకల వలె నలుపు రంగు వేసిన జనపనార పీచు చిక్కం ఒళ్ళంతా తొడుక్కొనితాసాఅనే వాయిద్యానికి అనుగుణంగా ఎలుగు బంటివలె గంతులేస్తుంటారు.

 

తాసాఅంటే మెడనుండి గుండెలమీదకు తాడుతో వేలాడదీసుకొని రెండు చేతుల తోనూ గెండు పుల్లముక్కలతో వాయించే వాయిద్యం. ఇందులో శక్తి వేషం కూడా వుంటుంది.

చెక్కతో చేయబడి, రంగులు వేయబడి, పెద్ద నాలుక చాపి చూపుతున్న శక్తిముఖం తగిలించుకొని, పెద్ద పెద్ద స్థనాలు అమర్చుకొని, పైన నల్ల అంగీ తొడుక్కుని, ఒక చేతిలో కత్తి, ఒకచేతిలో శూలం ధరించి ఎలుగు బంట్లతో సమంగా ఎగురుతూ చేరిన జనాన్ని అప్పుడప్పుడు అదలిస్తుంటారు.

విశేషాలు చూడముచ్చటగాను, భయంగొలిపే విధంగాను ఉంటాయి. ఒకప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ సాంప్రదాయపు వేషాలను ఎంతగానో ఇష్టపడి ఆనందించేవారు.

 

Read More : సోది

Leave A Reply

Your Email Id will not be published!