ధ్రువ నక్షత్రం

Dhruva Nakshatram

Telugu Marriage Tradition : Dhruva Nakshatram –

నూతన వధూవరులకు ఆకా శములో సంచరించు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపుతారు. పగటి ముహూర్తానికి సూర్యదర్శనం, రాత్రి ముహూర్తానికి ధ్రువనక్షత్ర దర్శనం వైదికంగా జరుగుతాయి.

ఆకాశంలో ధ్రువ నక్షత్రం ప్రముఖమైనది. స్థిరత్వానికి, శాశ్వతత్వానికి ధ్రువనక్షత్రం ఒక సంకేతం. మం. ధ్రువక్షితి ధ్రువయోనిః ధ్రువమసి ధ్రువస్థితంత్వం నక్షత్రాణాం మేథ్యసి సమాపాహి పృతన్యతః అర్ధము : ధ్రువనక్షత్రమా! నీవు నాశనము లేని స్థిర నివాసము కల దానవు.

 

 

ఇతర నక్షత్రాలు కూడ స్థిరత్వాన్ని పొందుటకు మార్గదర్శకు రాలివైతివి. నీ చుట్టూ నక్షత్రాలు నిన్ను ఆధారం చేసుకొని తిరుగుచున్నవి నీ గదా! అట్లే నా పతి ఇంటియందు నేను కూడ స్థిరముగా ఉందును. కనుక నాకు స్థిరత్వమును ఇమ్ము.

 

Read More : అప్పగింతలు

Leave A Reply

Your Email Id will not be published!