Telugu Dance Tradition : Dhimsa Dance
అరకు లోయలో ప్రసిద్ధమైన నృత్యాలలో దింసా నృత్యం ఒకటి. వృద్ధులు, యువకులు, పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు దింసా నృత్యంలో పాల్గొంటారు. కష్టజీవులైన గిరిజనులకు ఇటువంటి కార్యక్రమాలు అంతులేని ఆనందాన్నిస్తాయి. దింసా నృత్యం అందరిని అలరించడమే కాక, గ్రామీణ ప్రజల మధ్య సుహృద్భావాన్ని పెంపొందిస్తుంది.
దింసా నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు?
దింసా నృత్యాన్ని చై పర్వంలోనూ, వివాహ సమయంలోనూ, పండుగ పర్వదినాలలోను ప్రదర్శిస్తారు. దింసా నృత్యంలో విలక్షణమైన సంగీత వాయిద్యాలున్నాయి.
‘తుండి‘, ‘మోరి‘, ‘కిరిడి‘, తుడుము, డప్పు మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో లయబద్దంగా ఈ నృత్యం సాగుతుంది. ఈ నృత్యంలో కళాకారుల్ని ఉత్తేజపర్చడానికి మధ్య మధ్య.. జోడు కొమ్ము బూరలను కూడా ఊదుతారు, స్త్రీ పురుషలందరూ సాంప్రదాయకమైన ఆభరణాలు ధరించి, రంగురంగుల దుస్తులను అలంకరించుకుని, నృత్యానికి హాజరువాతారు.
దింసా నృత్యంలో ఎనిమిది నకాలున్నాయి. అవి.
1. బోడె దింసా
2. గుండేరి దింసా
3.పోతార్ తాలం
4. బాగ్ దింసా
5.నాటికారి
6.కుందా దింసా
7. బాయా దింసా అనే నృత్యాలు ఉన్నాయి.
వీటితో పాటు కొందులు ప్రదర్శించే ‘మయూరి నృత్యం‘ బోదోమరలు ప్రదర్శించే ‘డుడుగా నృత్యం‘ భగలు ప్రదర్శించే ‘పెండ్లి నృత్యం‘, గడభలు ప్రదర్శించే ‘కంగారి నాట్యం‘, కోయవారు ప్రదర్శించే కొమ్ము నృత్యం, మరియు సవరలు ప్రదర్శించే అందెళ రవ్వ నృత్యం వంటి మొదలగు నృత్యాలను ప్రదర్శిస్తూ వీరు ఆనందోత్సాహాలతో మునిగిపోతారు.