దీపం పెట్టడం
Deeparadhana
Telugu Tradition : Deeparadhana –
దీపం పెట్టడం మన హిందూ సంప్రదాయంలో చాలా విశిష్ట స్థానాన్ని పొందినది. రోజు శుచిగా స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకొని దేవుని ఎదుట నిలిచి నేతితో కాని నూనెతో కాని దీపాన్ని వెలిగిస్తారు. దీపం వెలిగించే విధానము
ముందుగా దీపంలో వేయవలసిన వత్తిని తీసుకొని వాటి కొనలని వేళ్ళతో దగ్గరికి చేయాలి. ఇప్పుడు దీపంలో నూనె కానీ నెయ్యి కాని వేయాలి. వత్తులను మొత్తం నూనె కానీ నెతితో కానీ తడపకూడదు. ఇలా చేయటం వల్ల దీపం కొందేక్కదు (దీపం ఆరిపోయింది అని అనకూడదు, అందుకే దాని బదులుగ కొండెక్కింది అంటారు). ఇప్పుడు వత్తిని వెలిగించండి. కుంకుమను తీసుకొని దీపానికి పెట్టాలి. మీరు కూడా కుంకుమను ధరించాలి.
దీపం పెట్టె సమయం లో ఈ క్రింది శ్లోకం చదవాలి.
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్ధన, దీపేన హరతే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపము కలిగిన ఇంట, దాపున శ్రీలక్ష్మి ఉండి పాపములు పారద్రోలి, ధనములను ఇచ్చి, ఆరోగ్యం, శాంతిని ఇచ్చి, బ్రహ్మాండముఖి కాపాడుము మమ్ము అని అనుకోవాలి.