దాగుడు మూతలు

Dagudu Moothalu

Telugu Traditional Games : Dagudu Moothalu –

చిన్న పిల్లలు పెద్ద పిల్లలతో కలసి ఆడుకునే ఆట ఇది. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లలు ఆటలో పెద్దగా వ్యవహరిస్తారు. వారు ఇంట్లో పిల్లలతో పాటుగా ఇరుగుపొరుగువారిని కూడా పిలుచుకుని ఆటను మొదలు పెడతారు. ఆటలో పిల్లల సంఖ్యతో నియమం లేదు. పిల్లలంతా వరుసగా నిల్చున్న తరువాత అందులో పెద్దగా ఉన్నవారు ఎదురుగా నిల్చున్న వారిలో ఎవర్నో ఒకరిని పిలిచి వారి వెనుక కూర్చుని ముందు కూర్చున్న వారి కళ్లను ఒక చేత్తో మూస్తారు.

కళ్లు మూసిన మరో చేత్తో కళ్లు మూయించుకున్నవారి చేతిని పట్టుకొని తిప్పుతూవీధి వీధి గుమ్మడి.. వీరి పేరేమి అంటూ పాటపాడుతారు. మధ్యలో దాగుడు మూతలు దండాకోర్ అని ఎదురుగా నిల్చున్న పిల్లలను అటు ఇటు మారి నిలబడమంటారు. తరువాత వీధి వీధి గుమ్మడి వీధి పేరేమి అంటూ కళ్లు మూసిన వారి చేతితో పట్టుకొని ఒక్కోక్కరి పేరు అడిగి చెప్పిస్తాడు. కళ్లు మూసుకొన్న పిల్లవాడు పేరు చెప్పితే పేరుతో వారిని దాక్కొమని చెప్తారు. తరువాత చివరకు అందరూ దాక్కున తరువాత దాగుడు మూతలు దండాకోర్ పిల్లీ వచ్చే ఎలుక భద్రం అంటూ కళ్లగంతలను తీసివేస్తారు.

 

కళ్లమీద ఉన్న చేయిని తీసివేసి దాక్కుని వారిని పట్టుకోమని చెప్తారు. అట్లా దాక్కున్నవారిని కనిపెడితే వాళ్లు ఔట్ అయినట్టు అంటారు. ఇలా అందరినీ ఔటు చేసి మొదట ఔట్ అయిన వారిని దొంగగా నిర్ణయించి మళ్లీ పెద్దవారి వీరి కళ్లు మూసి ఆట మొదలు పెడతారు. ఇలా చాలా సేపు ఆట కొనసాగిస్తారు. పిల్లలంతా సంతోషంగా ఆడుకుంటారు.

దాగుడు మూతదండాకోర్, పిల్లీ వచ్చే ఎలుకా బద్రమ్ ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చిప్ సాంబారు బుడ్డీ కళ్ళూ మూసీ కాలీకోర్, ఎక్కడి దొంగలు అక్కడనే అడుక్కోబడుక్కో సాంబార్ బుడ్డీ

 

Read More : వైకుంఠ పాళీ

 

Leave A Reply

Your Email Id will not be published!