కళ్యాణ మండప ( వేదిక ) నిర్మాణము
Decoration of Kalyana Mandapam (Venue)
Telugu Marriage Tradition : Decoration of Kalyana Mandapam (Venue) –
శాస్తోక్తంగా వివాహ కళ్యాణ వేదికను నిర్మించాల్సిన విధానాన్ని ఈ విధంగా చెప్పారు.
అశ్వని, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం ఈ నక్షత్రములయందునూ; ఆది, సోమ, బుధ, గురు, శని వారములలో యోగ్యమైన తిథియందును; పంచమి, నవమి స్థానము లలో పాపగ్రహములు లేని శుభలగ్నం చూచి వివాహవేదిక, పందిళ్ళు వేయించవలెను.
కళ్యాణ వేదిక 4 మూరల పొడవు, 4 మూరలు వెడల్పున్నూ ఒక మూర ఎత్తు కలిగి ఉండవలెను. గృహమునకు ఈశాన్య భాగమున ఏర్పాటు చేయాలి. నాలుగు మూలల నాలుగు స్తంభములు ఉండవలెను. లేక వధువు యొక్క చేతి మూరలు అయిదు మూరల వెడల్పు ఏడు మూరల బారు, ఒక మూర ఎత్తు ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. సింహద్వారము నుండి బయటకు వచ్చునపుడు ఎడమ ప్రక్కగా నుండవలెను.
వివాహ మండప నిర్మాణము నాలుగు వైపులా చతురస్రముగా ఉండే విధంగా నిర్మించాలి. పెండ్లి కుమార్తె చేతిమూరలతో ఎనిమిది లేక పన్నెండు మూరలతో ఈ వివాహ మండపమును చతురస్రముగా నిర్మాణము గావించాలి అని చెప్పబడింది. వివాహ మండపమునకు నాల్గు వైపుల ద్వారములు, మెట్లు ఉండవలయునని, దానిని పలురకాల దేవతా చిత్రపటములతో పూలమాలతో ఆకర్షణీయంగా, అందంగా అలంకరిం చవలెనని వశిష్ట మహర్షి, నారద మహర్షి మొదలగువారు తెలియజేసిరి.
పులివేషం
సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులి వేషం కడతారు. ఇది తెలుగువారి వేడుక. డప్పు వాద్యానికి అను గుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు.