మా లక్షమ్మ చెట్టు వద్ద వేడుక
Marriage Traditions
Marriage Traditions – Maha Lakshmi : మనము నివసించే ఊరిలో మహాలక్ష్మమ్మ(Maha Lakshmi) చెట్టు అని పూజలు అందు కునే వేపచెట్టు ఉంటుంది. ఆ దేవాలయం వద్దకు మేళ తాళములతో కొత్త దంపతులను తీసుకెళ్ళి ఆ దేవతా వృక్షానికి పూజ చేయించెదరు.
అలాంటి అవకాశం లేనిచో ఒక పూలకుండీకి పసుపురాసి కుంకుమ బొట్లతో అలంకరించి, ఆ కుండీలో ఒక వేపకొమ్మ పెట్టి ఆ కుండీ వద్ద నూతన దంపతులు దీపారాధన చేసి ఆ చెట్టుకు పూజచేయుదురు. తల్లికి(Maha Lakshmi) పొంగలి, పండ్లు యారనాలు నైవేద్యము మొదలగునవి సమర్పిం చెదరు. ఆ యారనాలు ఏదైనా అమ్మవారి గుడిలో ఇవ్వవలెను.