బుర్ర కథ

Burra Katha

Telugu Tradition : Burra katha –

ప్రబోధానికీ, ప్రచారానికి సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగ పడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. ఇది సంగీతం, నృత్యం, నాటకం మూడింటి మేలుకలయిక.

బుర్రకథలో నవరసాల సమ్మేళనం ఉంటుంది. ముఖ్యంగా వీర, కరుణ రసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీరగాథలను గానం చేసేందుకు ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తుంది.

బుర్రకథ అనగానే నాజర్ పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం బుర్ర కథలు బహుళ ప్రచారం పొందినవి.

ముగ్గురుతో కూడిన బృందం

ముగ్గురు బృందముగా ఉండే బుర్రకథ ప్రదర్శనలో మధ్య పాత్రధారి ముఖ్య కథకుడు గానూ, మిగిలిని ఇద్దరిలో ఒకరు వంత కథకు, మరొకరు హాస్య కథకులుగానూ ఉంటారు. సాధారణంగా ఇది నిలుచుని చెప్పే కథ ఐనా, సౌలభ్యత కోసం కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయగలవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపాన దొడ్డిపట్ల గ్రామంలో కూర్చుని బుర్రకథ చెప్పే బృందాలు ఉన్నాయి.

వినరా భారత వీరకుమారా విజయం మనదేరా అన్న చరణం బుర్రకథల్లో సర్వ సామాన్యం. బుర్రకథ ప్రదర్శకులలో ముగ్గిరిని కథ, రాజకీయం, హాస్యం అని పిలుస్తారు. మధ్యలో ఉండే కథకుడు పాడేదానికి చెప్పేదానికీ ఇటూ అటూ ఉన్న ఇద్దరూ తందాన తానా అని వంత పాడతారు. కాలపరిణామములో యక్షగానమే బుర్రకథగా రూపొందింది అంటారు. కథకుడు వాయించే తంబురా బుర్రనుబట్టి బుర్రకథ అని పేరు వచ్చింది. కథలో వంతతందానతాన”, కాబట్టి దీనినితందాన పాటఅనికూడా అంటారు. యక్షగానంలో కథచెప్పేది స్త్రీ. బుర్రకథలోకథ సామాన్యంగా పురుషుడే చెబుతాడు. ఇపుడు స్త్రీలు కూడా బుర్రకథ చెపుతున్నారు. దీనిని వృత్తిగా స్వీకరించి ప్రచారంలోకి తెచ్చినవారు జంగాలు.

అందుకే దీనికిజంగం కథఅనికూడ పేరు వచ్చింది. కథకుడు సామాన్యంగా నిలుచుని కథ చెప్పడు. ముందుకు వెనుకకు అడుగులు వేస్తూ, నృత్యంచేస్తూ, గిర్రున తిరుగుతూ, మధ్య మధ్య కూర్చొని అభినయిస్తూ కథ చెపుతాడు. దీనితో ప్రేక్షకుల హృదయాలు రసారమవుతాయి. కథ :ఇతనే ప్రధాన కథకుడు. ముఖ్య కథను, వర్ణనలనూ, నీతినీ, వ్యాఖ్య లనూ వచనంగాఅంటే మాటల్లో చెబుతూ, సందర్భం వచ్చిన చోట భావపరమైన స్ఫూర్తిని కలిగించేందుకు రసవంతమైన పాటలు పాడతాడు. కథకుడు ముఖ్య కళాకారుడు. ఇతనే ముఖ్య కథకుడు.

ఇతను హాస్యంగా మాట్లాడడం చాలా అరుదుగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా వేరే కబుర్లతో మిగిలిన ఇద్దరూ పక్కదారి పడుతున్నా.. ముఖ్య కథలోకి తీసుకొస్తూ నిబద్ధతతో కథ చెప్పడం ఇతని బాధ్యత. పాత్ర పోషించే వ్యక్తికి మాటా, ఆటా, పాటా బాగా తెలిసి ఉండాలి. ఇక కథ సంగతి సరేసరి. అతని వేషధారణ కూడా రంగుల అంగరఖా, తలపాగా, నడుము గుడ్డ, ముత్యాల గొలుసు, కాలిగజ్జెలతో కనుల పండువుగా ఉంటుంది.

రెండో వ్యక్తి : ఇతను ముఖ్య కథకుడి కుడిభుజం వైపు ఉంటాడు. అంటే బుర్రకథ చూసేవారు ఎడమ పక్కనుంచి ఒకటి, రెండు, మూడు అని లెక్కపెడితే మొదట లెక్కకు వచ్చేది ఇతనే! ఇతను హాస్యగాడు కాదు. ఇతన్ని రాజకీయం అంటారు. అంటే ముఖ్య కథకుడు ఎక్కువగా పాటలతో కథను చెబుతుంటేమధ్యలో వచనం వచ్చినప్పుడల్లా సీరియస్ చర్చల్ని ఇతను కథకుడితో చేస్తుంటాడు. లేదా అతను వచనంతో కథ చెబుతుంటే ఆహా ఓహో అంటూ వంత పాడుతుంటాడు.

రంగుల దుస్తులతో, విభూతి రేఖలతో, చేతి డప్పులతో వీరు కథకునికి పాటలోనూ, చిందులోనూ తోడుంటాడు. కథలో పట్టు నిలబెడుతుంటారు. ఏమైందని ప్రశ్నిస్తూంటాడు. ఉత్సాహాన్ని, ఊపును పెంచుతుంటాడు. ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంటాడు. మూడో వ్యక్తి హాస్యం చేసినప్పుడు అతనితో ఇతను చర్చిస్తాడు. సమయంలో కథకుడు వెనక్కి వెళ్తాడు. రాజకీయం, హాస్యం ఇద్దరూ సరదా సంగతులు చర్చించుకున్నాకమళ్లీ మధ్యలోని కథకుడు ముందుకొచ్చి ముఖ్య కథను కొనసాగిస్తాడు.

అయితే కొందరు అపోహపడే విధంగా రాజకీయం అనే వ్యక్తిహాస్యగాడితో చర్చిస్తాడే గానీ హాస్యాన్ని పంచడం ఇతని బాధ్యత కాదు. కథ చెప్పేటప్పుడు ముఖ్య కథకుడికి అండగా ఉండి సహకరించడమే ఇతని ముఖ్య బాధ్యత. మూడవ వ్యక్తి హాస్యం. బుర్ర కథ మొత్తం తీక్షంగా సాగితే ఇబ్బంది కాబట్టిఅవకాశం ఉన్నప్పుడల్లా ఇతను హాస్యంగా మాట్లాడతాడు. ప్రస్తుత నిత్య జీవితానికి సరిపడే విధంగా కబుర్లు చెబుతూముఖ్య కథకి అప్పుడప్పుడు అడ్డుకట్ట వేస్తున్నట్టు అనిపిస్తుంది గానీఅది కేవలం వినోదం కోసమే! హాస్యగాడు తన హాస్యంతో ముఖ్య కథ తాలూకు విలువని తగ్గించకూడదు. ఎక్కడైనా అలా తగ్గితే కథకుడు జోక్యం చేసుకుని కథ తాలూకు గాంభీర్యాన్ని కోల్పోకుండా చూస్తాడు. తిరిగి కథలోకి జనాన్నితీసుకు వెళతాడు.

 

Read More : జోగాట

Leave A Reply

Your Email Id will not be published!