ఎడ్ల పందెములు
Bull Race Competition
Telugu Festival Tradition : Bull Race Competition –
ఎడ్ల పందెములు బలప్రదర్శనకు చకాలు తిరగకుండా వానిని తొట్టికి కట్టేసి ఎడ్లు కట్టి లాగిస్తారు. ఏ బండి ముందు గమ్యం చేరితే ఆ ఎడ్ల జత నెగ్గినట్టు. ఈ పని కొన్ని ట్ల ఇసుకలో కూడా చేయిస్తారు. కొన్ని చోట్ల బండిలో బరువు బస్తాలు కూడా వేస్తారు.
కొన్నిచోట్ల ఎద్దుల జతకు పెద్ద పెద్ద రాళ్ళను కట్టి వాటిచేత ఈ రాళ్ళను లాగిస్తారు. ఈ విధమైన ఎడ్లపోటీలు ప్రముఖ పర్వదినాలలో, తిరునాళ్ళలో జరుపుతారు. గెలిచిన ఎడ్లజతకు బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. ఎడ్ల పందాలు కూడా తెలుగువారి వినోద సంప్రదాయాలలో ఒక భాగమై పోయింది.