Telugu Marriage Tradition : Brahma Mudi –
తలంబ్రాలు తంతు ముగిసిన తర్వాత, “బ్రహ్మముడి” వేడుక జరుగు తుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, “ఇంటి యజమానురాలు”గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు. దీనినే బ్రహ్మగ్రంధి, కొంగులు ముడివెయ్యడం అని కూడా అంటారు. ఇద్దర్ని కలిపి క్రొత్త వ్యక్తిని సృష్టించడం. రెండు శరీరాలు, రెండు మనస్సులు ఏకత్వమవ్వడమన్నది ఇక్కడ చాటి చెప్పబడుతుంది.
కొంగుముడిలో నాణెం, పువ్వులు, దర్భలు, పసుపుకొమ్ములు, అక్షిం తలు, కందపిలక, ఆకులు, వక్క వేస్తారు. వధూవరుల మీద అక్షింతలు వేస్తూ పురోహితుడు ‘ధ్రువంతేరాజా వరుణో ధృవం దేవో బృహస్పతిహి, ధృవంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రంధారయతాం ధృవం‘ అని మంత్రం చదువుతాడు.
దాంపత్య సామ్రాజ్యాన్ని ధరించిన మీకు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వం కలుగచేయుదురుగాక అని అర్ధం.
ఇంకొక రకంగా పై మంత్రాలకి ‘పూషా‘ (దేవతలయందు శ్రేష్టుడై నటువంటివాడు) వెంట తీసుకుని వెళ్ళాలి. అశ్వినీ దేవతలు నీ చేతులు పట్టుకుని రధం పైన తీసుకుని రావాలి. ఇంటి ఇల్లాలిగా అన్నీ తీర్చిదిద్దడా నికి నా ఇంటికి రా. ఒక యజమానురాలిగా గృహస్థ ధర్మాన్ని నిర్వహించు. ఇది కేవలం రెండు వస్త్రాలని కలపటం కాదు. ఇద్దరు వ్యక్తులను కలిపి కొంగొత్త ఆకారాన్ని సృష్టించడమే దీని లక్ష్యం.
నీది అని ఏమీ లేదు. ఎవరు సంపాదించినా దాని మీద అధికారం ఇద్దరికీ ఉంటుంది. ఆదాయం, ఖర్చు, ప్రణాళిక కలిపి ఉమ్మడిగా చెయ్య వలసిన పనులని భావం. దర్భగడ్డి ఎప్పటికి వాడని ప్రేమకి నిదర్శనం. దర్భగడ్డి తన జీవ లక్షణాన్ని కోల్పోదు. కాసిన్ని నీళ్ళు చల్లితే చాలు, మళ్ళీ పచ్చగా మారుతుంది. ఇలా వివాహ బంధం ఎప్పటికీ పచ్చగా ఉండాలని, జీవితాంతం వారి మధ్య ప్రేమాభిమానాలు, సహచర్యమూ సజీవంగా ఉండాలన్నది తాత్పర్యము.
భార్య చిటికిన వేలును భర్త చిటికిన వేలుతో పట్టుకోమని బ్రహ్మ ముడి వేస్తారు. ఇందులో ఉన్న పరమార్థాన్ని ఈ విధంగా చెబుతారు. భార్య భర్తల బంధంలో ఒకరిని ఒకరు విడిచి ఉండకూడదు. ప్రయా ణమైన పుణ్యక్షేత్రమైన–మోక్షమైన–వనవాసమైన భార్య భర్తలు కలిసి వెళ్ళాలి–ఉండాలి. భార్య భర్తలుగా మారటం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించటం.
భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన ఎన్ని మనస్పర్ధలు ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి.., అంటే వీళ్ళ మధ్య ఇంకొకరు దూరటానికి వీలు లేని విధంగా ఉండాలని, అలా ఉంచుకోవాలని గోరంత స్థలము ఏర్పడినా ఆ అదును చూసుకొని మూడో వ్యక్తి స్థలము ఏర్పరచుకుంటారని – ఏమి జరిగినా భర్తతోనే జీవితం అనుకోవాలని స్త్రీకి–భార్యే సర్వస్వంగా భావించాలని భర్తకి చెప్పి బ్రహ్మ ముడి వేస్తారు – “అంటే రెండు శరీరాలను ఒక ప్రాణంగా మార్చటం