బొమ్మని అప్పగింత
Bommani Appagintha
Telugu Marriage Tradition : Bommani Appagintha –
పెండ్లి కొడుకు సోదరికి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, నూతన వస్త్రములు తాంబూలంతో కలిపి ఇవ్వవలెను. ఆ అమ్మాయి భర్తకు నూతన వస్త్రములు పెట్టాలి. ఇద్దరు కొత్త బట్టలు కట్టుకొనవలెను.
మీటరు మల్లు గుడ్డలో చెక్కబొమ్మను ఉంచి అటు చివర ఇటు చివర ఇద్దరు పట్టుకొని పెండ్లి కుమారునకు పెండ్లి కుమార్తెకు మధ్యలో ఉంచి ఊయల ఊపుచూ ఆ బొమ్మమీద వసంతము కొద్దిగా పోయాలి.
(నీళ్ళలో సున్నము, పసుపు కలిపితే ఎరుపు రంగుగా మారును) ఆ నీళ్ళు పెండ్లి కుమార్తె ప్రక్కన ఉన్న సోదరుని తొడమీద పదే విధంగా చేయాలి. ఆ సోదరునికి పెండ్లి కుమారుని వారు నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించాలి. అవి ఇచ్చునప్పుడు ఆడపడుచు పట్టెనిస్తావా–పాడి ఆవును ఇస్తావా అని అడగాలి.
అప్పుడు కొత్త దంపతులు పట్టెని ఇస్తాను, పాడి ఆవును ఇస్తాను అని చెప్పి చెక్క బొమ్మను వారికి అందిస్తారు. (స్టోమత కలిగిన వారు దీనితోపాటు వెండి బొమ్మను కూడా ఇస్తారు). తరువాత నూతన దంపతులచేత పేర్లు చెప్పిస్తారు.