బొడ్రాయి

Bodrai

Telugu Festival Tradition : Bodrai

చాలవరకు పల్లెల్లో గ్రామానికి సంబంధిం చిన ప్రధాన ద్వారం ఉంటుంది. దానిని ఊరి వాకిలి (జనవ్యవహారంలోఉరాకిలి), చావిడి, గ్రామ ప్రవేశ ద్వారం మొదలగు పేర్లతో పిలుస్తారు. ఊరుదాటి వెళ్ళేటప్పుడు

చావిడిలోనే మధ్యలో, నేలలో బొడ్రాయిని ఉంచుతారు. బొడ్రాయికి సంబంధించిన సంస్కృతిసంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుంది. కొన్ని గ్రామాలలో ఊరి బయట కట్టకట్టి కూడ ఉంచుతారు. చావిడిలో బొడ్రాయిని ఉంచిన గ్రామాలలో, ఊరి బయట లింగమయ్య పేరుతో మరో రాయిని ప్రతిష్ఠించి కట్ట కట్టి పూజిస్తారు.

వివాహాల సందర్భాలలో ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళేటప్పుడు గానీ, బయటి ఆడపిల్లలు ఊరికి కొత్త కోడళ్ళుగా అడుగుపెట్టేటప్పుడు గానీ, గ్రామ ప్రవేశద్వారంలో ఉండే బొడ్రాయిని పూజించి గ్రామం విడిచి వెళ్ళడం గానీ, గ్రామంలోకి అడుగు పెట్టటం గానీ చేస్తారు. సందర్భంలో బొడ్రాయి దగ్గర పూజారులుగా గ్రామానికి సంబంధించిన బోయలు గానీ, తలారి (తలవరి/గ్రామ సేవకులుగా) పని చేసేవారు కాని ఉంటారు. అలాగే గ్రామ దేవరలకు (ఈదమ్మ, సవారమ్మ, పెద్దమ్మ మొ.) కొలుపులు చేసే సందర్భంలో ఉరాకిలిలోని బొడ్రాయి ముందే జంతువులను (దేవరపోతులను) బలి ఇవ్వటం సంప్రదాయం. చివరికి ఎవరైనా ఊర్లో చనిపోయినా, శవాన్ని సైతం ఉరాకిలిలోని బొడ్రాయి మార్గం గుండా ఊరు దాటించాల్సిందే.

కాలగమనంలో మార్పులు

ఇప్పుడు గ్రామాలు విస్తరించడం వలన, భిన్న మతాలు ప్రవేశించడం వలన సంస్కారాలలో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చావిడిలో, నేల నుండి ఎద్దుల బండి పరం తాకే ఎత్తులో (సుమారు మోకాలు ఎత్తు వరకు ఉండే విధంగా) బొడ్రాయిని ఉంచేవారు. కాలక్రమంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల వలన కేవలం చిన్న రాళ్ళుగా మాత్రమే కనిపిస్తున్నాయి. బొడ్రాయి పూర్తిగా నేలలో కనిపించకుండా మునిగిపోయినప్పుడు తిరిగి పునఃస్థాపన చేస్తూ ఉంటారు. సందర్భంలో గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.

 

Read More : జముకుల కథలు

Leave A Reply

Your Email Id will not be published!