భోగం మేళాలు
Bhoga Melalu
Telugu Traditional Events : Bhoga Melalu –
ఒకప్పుడు భోగంమేళాలు లేనిదే ఏ ఉత్సవాలు జరిగేవి కాదు. పది పదిహేనుమంది భోగపు స్త్రీలు మేళంగా వస్తారు. ఈ మేళానికి ఒక నాయకురాలు ఉంటుంది. ఫిడేలు, హార్మోనియం, మద్దెలలు ప్రక్క వాయిద్యాలుగా ఉంటాయి.
వీరు సినిమా పాటలు పాడుతూ ఇద్దరు ముగ్గురు ముందుకొచ్చి నాట్యాలు చేస్తుంటే మిగిలిన వారు వెనుక నిలబడి తాళంకొడుతూ పాడుతుంటారు. సాధారణంగా విలాస పురుషులే వీరి చెంతకు వస్తారు. వారు కోరిన ప్రకారం వీరు పాడి ఆడుతుంటారు. తర్వాత తాంబూలాలిచ్చి రవంత రంగుచేసి సొమ్ములు వసూలు చేస్తుంటారు.
వీరు అప్పుడప్పుడు సిగ్గులేకుండా పచ్చి శృంగారంకూడా వెలగ బెడుతూ రసికులను రెచ్చ గొట్టడం కూడా జరుగుతుంది. ఇలాంటి వానిలో వీరు నిర్వహించే ఎలుగుబంట్ల నృత్యం (బేర్ డాన్స్) చెప్పుకోదగ్గది. ఒకామె మగ ఎలుగుగానూ, మరొక ఆమె ఆడ ఎలుగుగానూ నటిస్తూ చూపించే రతిక్రియ లాంటివి కృత్యాలు వయస్సు పండినవాళ్ళను కూడా ఉత్సాహపరుస్తాయి.
అలాగని వీరిదంతా చౌకబారు నాట్యం అనడానికి వీలు లేదు. వీరి మేజువాణీ ఉత్తమ నాట్య శ్రేణికి చెందిన పక్రియ. నాయకురాలు పాడే జావళీలకు పండిత పామరులు కూడా పరవశించ వలసిందే. అంటే వీరి మేళాలు భక్తి శృంగారాల మేళవింపు అన్నమాట.