బావిలో చేద వేయుట

Bavilo Chheda Veyadam

Telugu Tradition : Bavilo Chheda Veyatam : కావలసినవి : పసుపు, కుంకుమ మోదీ ముద్దలు, మూడు వెల్లుల్లి పాయలు, మూడు కప్పుల శనగలు, సాంబ్రాణీ కడ్డీలు, దీపారాధన వత్తులు, పత్తి, పూలు, దారము, ఆకులు, పండ్లు, వక్కలు, అగ్గిపెట్టె పత్తిగింజలు మొదలగు వస్తు సామాగ్రి ఒక పళ్ళెములో సర్దుకొనవలెను.

బావి వద్దకు వెళ్ళునపుడు బాలింతకు నడికట్టు, తలపై గుడ్డ, పొత్తిగుడ్డ ఉంచవలెను. బాలింత బావి వద్దకు వెళ్ళునప్పుడు దారిలో పత్తిగింజలు చల్లుతూ వెళ్ళవలెను. మూడు బిందెలకు బయటవైపు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించవలెను. మూడు పోగుల పసుపు దారముతో తమలపాకు మడిచి ముడివేసి దానిని తోరము వలె బిందెకు కట్టవలెను. ఒక బిందెలో కొద్దిగ మజ్జిగ 10, 15 పత్తి గింజలు, ఒక తమలపాకు వేయవలెను.

బావికి గుండ్రముగా పసుపురాసి ఐదు కుంకుమ బొట్లు పెట్టవలెను. మనకు అందుబాటులో బావిలేనిచో బోరింగుపంపు వద్ద, బావివద్ద మూడు రాళ్ళుకానీ, మూడు మట్టి ముద్దలు కానీ పెట్టి వాటిని పసుపు కుంకుమలతో అలంకరించి వాటిని గౌరీదేవిగా భావించి, పూజచేసి గౌరీదేవి పాటపాడాలి.

 



తరువాత నైవేద్యము పెట్టాలి. పూజ అయిన తరువాత బిందెలోని తమలపాకు పట్టుకుని మజ్జిగ చుక్కలు బావిలో విడుస్తూఅమ్మా గంగాభవాని మజ్జిగచుక్కలు తీసుకొని పాలచుక్కలు మాకు ప్రసాదించు తల్లీఅంటూ పత్తిగింజలు, తమలపాకు, బావిలో విడవాలి. .

బావిలో బాలింత మూడు చేదలు నీళ్ళు తోడిన తరువాత పక్కవాళ్ళు నీళ్ళు తోడి, మూడు బిందెలు నింపవలెను. ముద్ద అందుకొను వారికి మోడి ముద్దలు మూడు, వెల్లుల్లిపాయలు మూడు, పండు, తాంబూలము, శనగలు కొంగులో పెట్టవలెను.

బిందెలో నీళ్ళు తాకి ముద్ద ఇచ్చిన వారి వీపుమీదఏటాబాలింత ఏటా శూలింతఅంటూ రెండు చేతులతో కొట్టవలెను. ముద్ద తీసుకొనిన వారు బాలింత వీపుమీద అలాగే కొట్టవలెను.

తరువాత బిందె చేతికి అందించవలెను. బిందెలు తీసుకొని ఇంటి లోపలకు వచ్చునపుడు వదిన, మరదళ్ళ వరసైన వారు గుమ్మము వద్ద ఆమెను ఆపి వాళ్ళ భర్త పేరు చెప్పించి లోపలకు పంపుట ఆచారము.

తరువాత బిందెలు పూజ మందిరము వద్ద పెట్టి స్వామివారికి నమస్కరించాలి. వెళ్ళునపుడు లోపలకు వచ్చిన గుమ్మములో కాకుండా వేరే గుమ్మము గుండ రావలెను. సమయంలో గర్భిణి ధరించిన స్త్రీలు ఉన్నచో వీరికి ఎదురు రాకూడదు.

మోడి ముద్దలుమోడిపుల్లలు వేయించి మిక్సీలో పౌడరుగా చేసి పిండిలో మినపపిండి, బెల్లము, నెయ్యి కలిపి ముద్దలుగా చేయాలి. , . మోడి పిండి 1, మినపపిండి, 2.బెల్లము, 3.డబ్బాలు. తరువాత ఊయలకు పూలతో అలంకరణ చేసి పట్టుచీరవేసి ఆకులు, వక్కలు, శనగలు, పండ్లు, తాంబూలం ఊయలలో నాలుగు వైపులా ఉంచవలెను.

బాబుని ఊయలలో తూర్పువైపు తల ఉంచి, పరుండ పెట్టి హారతి ఇవ్వవలెను. జోలపాటలు, లాలిపాటలు పాడుతూ ఊయల ఊపవలెను.

21, 23, 25, 27, 29 దినములలో సోమ, బుధ గురువారములు, 2, 3, 7, 10, 13 తిథులు, పున, పుష్య, అనూ, శ్రవ, మృగ, హస్త, , మూల తారలు మంచివి.

 

Also Read : ముదిమనవల సంతానము అయితే

Leave A Reply

Your Email Id will not be published!