అరుంధతి నక్షత్ర దర్శనము
Arundhati Nakshatra Darshanam
Telugu Marriage Tradition : Arundhati Nakshatra Darshanam –
అరుంధతీ నక్షత్రం కనిపించేది రాత్రి పూట మాత్రమే. సప్తఋషి మండలం చివర వశి పుడి వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం.సప్త ఋషుల భార్యలలో వశి పుని భార్య అరుంధతి మొదటిది.
ఆరుగురు కృత్తికలు ఆరుగురు భార్యలు మీతోపాటు వారు కూడా కీర్తిని పొందినారు. అట్లే నాపతితో కీర్తి పొందు స్థిరత్వమును నాకు ఇమ్ము. అని కోరుకుంటారు. ఈ విధంగా మన భారతీయ వివాహ వ్యవస్థను పఠించిన ప్రతి మంత్రానికీ అర్ధాన్ని గ్రహించి, ఆ అర్ధాన్ని జీవితంలో ఆచరిస్తే సంసారం సుఖంగా సాగుతుంది.
మంత్రాల ద్వారా చేసుకున్న వాగ్దానాలు, పంచుకున్న నమ్మకాలను జీవితాంతం ఒకరి కోసం ఒకరు నిలుపుకోవటమే సంసారంలోని పరమార్ధం! అదే వివాహబంధం. అరుంధతీ నక్షత్రం వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట తూర్పు లేదా ఉత్తరానికి తీసుకువెళ్లి మొదట ధృవ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. ధృవనక్షత్రంలా వారు నిశ్చలమైన మనస్తత్వాలతో స్థిరంగా ఉండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఆకాంక్ష ఇందులో కలదు.