Telugu Traditional Games : Appadappada Tandra –
దీన్ని ఆడటానికి కొందరు పిల్లలు వలయా కారంగా కూర్చుంటారు. వాళ్లలో ఒకరు నేలమీద అరచేతిని ఆనించి పెడతారు. దాని మీద మరొకరు తమ అరచేతిని ఉంచు తారు. అలా అందరూ ఒకరి చేతిమీ దొకరు పెట్టిన తర్వాత… మొదటి చెయ్యి పెట్టిన పిల్లాడు తన రెండో చేత్తో అన్నింటికంటే పైన ఉన్న చేతిపై అప్పడప్పడ తాండ్ర, ఆవకాయ తాండ్ర గంగాలమ్మ చెవి పట్టుకో అని చరుస్తాడు. ఆ చెయ్యి ఎవరిదైతే ఆ అబ్బాయి… చెయ్యి తీసేసి పక్క వాళ్ల చెవి పట్టుకుంటాడు. అలా అందరి చేతులయ్యాక ఒకరి చెవులొకరు పట్టుకుని గిరి గారి… గిరి గారి అంటూ ముందుకీ వెనక్కి ఊగుతారు.