అన్నప్రాసన

Annaprasana

Telugu Tradition : Annaprasana –  కన్య, ధనుస్సు, మీన రాసుల లగ్నములలో చేయాలి.

మదనరత్నము ప్రకారము అన్నప్రాశనము ఆరు, ఎనిమిది మాసము లందు మగ శిశువుకు; ఐదు, ఏడు మాసములందు ఆడబిడ్డలకు శుభమని తెల్పుచున్నది.

నారదుని ప్రకారము శిశువు పుట్టిన నాలుగు మాసములలో అన్న ప్రాశన సంస్కారము పూర్తిగా నిషేధము. 6 మాసములన లేదా ఎనిమిదవ లేక తొమ్మిది లేక పది లేక పన్నెండవ మాసమున చేయవచ్చును.

మరికొంత మంది అభిప్రాయములో శిశువునకు దంతములు వచ్చిన తరువాత అన్నప్రాశన చేయవచ్చునని, శుక్లపక్షము, ఉత్తరాయణము, పుష్య నక్షత్రము మంచివి అని, నవమి తిథి కూడదని చెప్పిరి.

 

 

పారస్కర గృహ్య సూత్రముల ప్రకారము శిశువుకు పెరుగు, నెయ్యి, మధువుతో పాటు మాంసము కూడా కలుపవలెని చెప్పినది.
అన్నప్రాసన అంటే పుట్టిన శిశువుకు మొదటిసారి అన్నము తినిపించే కార్యక్రమం. ఇందుకు శిశువు జాతకచక్ర ఆధారంగా తారబలం చూసి ముహూర్తం నిర్ణయిస్తారు. ఇది హిందు సంప్రదాయంలో కనిపించే ఒక పెద్ద కుటుంబ పండుగ. సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి అని చెప్పబడుతుంది.

తొలిసారి అన్నం తింటున్న శిశువునకు జాతకచక్రం ఆధారంగా అనుభవజ్ఞులైన పండితుల దగ్గరకు వెళ్లి వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి శుభమూహూర్తమును అడిగి తెలుసుకుని పండితుడు నిర్ణయించిన శుభమూహూర్తాన అన్నప్రాసన చేయడం బిడ్డకు శ్రేయస్సు, యశస్సులు కలుగుతాయి.

అన్నప్రాశన కాలం

శిశువు వయసు 6 నుంచి 12 నెలలలోపు ఉండగా ఎప్పుడైననూ చేయవచ్చు. అయితే శుక్లపక్షంలో శుక్రుడు ఆకాశంలో పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నప్పుడు అన్నప్రాశన చేయాలి. మగపిల్లలకు సరి నెలలలోనూ, ఆడ పిల్లలకు బేసి నెలలలోనూ చేయాలి. దీనిని పూర్ణాహ్వమందు మాత్రమే చేయాలి. లగ్న శుద్ధి, దశమ శుద్ధి, వృషభ, మిధు, కటక,
దీని ప్రకారముశిశువునకు వాక్ ప్రవాహము కావలెను అనిన భారద్వాజపక్షి మాంసము, కోమలతకై చేపలను, దీర్ఘ జీవనము కొరకు కృశక పక్షి మాంసము లేక తేనెతో కలిపిన అన్నమును, తేజస్సు కొరకు ఆటి పక్షి మరియు తిత్తిరి మాంసమును, ఓజస్సు, తీక్షణబుద్ధి కావలెను అనిన నేతితో కూడిన అన్నమును, దృఢమైన దేహము కొరకు పెరుగు అన్నమును, అన్ని గుణములు కావలెను అనిన అన్ని పదార్ధములు సేవించ వలెనుఅని పారస్కర గృహ్య సూత్రములు వివరించినది.

అన్నప్రాశన ఆరో నెల ఆరవ రోజున చేయటం ఆచారం. రోజు చేసేప్పుడు ముహూర్తం అన్వేషణతో పని లేదు అని ఒక పెద్ద వాదన సంఘంలో ఉంది. అది చాలా తప్పు మరికొందరి భావన.

ఆరవ నెల ఆరవ రోజు, అమావాస్య కానీ, మంగళవారం కానీ గ్రహణం కానీ వస్తే అన్నప్రాశన చేస్తామా? కేవలం మూఢమి పట్టింపు లేదు అన్నారు కానీ ముహూర్త పట్టింపు లేదు అనే వాదన చాలా దోష వాదన అని వీరి అభిప్రాయము.

అన్నప్రాసన ముహూర్త ప్రభావం శిశువు జీవితం, ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి.

అన్నప్రాసన చేయు విధానం

ముందుగా గణపతి పూజ చేసి తర్వాత విష్ణు మూర్తిని, సూర్య, చంద్రులను అష్టదిక్పాల కులను, కుల దేవతను భూదేవిని పూజించి కార్య క్రమం ప్రారంభించాలి. కార్యక్రమం జరపడానికి శాస్త్రం సూచించిన నియమాలు పాటించాలి.

అన్నప్రాశన దైవ సన్నిధిలో చేయాలి. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపి స్వామి సన్నిధిలో అన్నప్రాశన చేయాలి అని చెబుతారు. లేదా తమ కులాచారం ప్రకారం నడచుకోవాలి.

శుక్లపక్షమి రోజులలో అన్నప్రాశన ఉదయం పూట మాత్రమే చేయుట ఉత్తమం. శిశువునకు కొత్త బట్టలు తొడిగి మేనమామ, మేనత్త కాని తల్లిదండ్రులు కాని తూర్పు ముఖముగా చాప లేదా పీటలపై కూర్చోవాలి. శిశువును తల్లి లేదా మేనత్త ఒడిలో కూర్చోబెట్టుకోవాలి. బంగారము, వెండి, కంచు మొదలగు పాత్రలో ఏర్పాటు చేసుకున్న నెయ్యి, తేనె, పెరుగులను ముద్దగా తండ్రి లేక మేనమామ కుడిచేతిలో బంగారు ఉంగరాన్ని పట్టుకుని పాత్రలోని నెయ్యి, తేనె, పెరుగులను ఉంగరం సహయంతో శిశువునకు తినిపించాలి. వసతి, (మతలను బట్టి బంగారు లేక వెండి స్పూన్లను కూడ ఉపయోగించుకోవచ్చును. తర్వాతనే అన్నం తినిపించాలి. ఇలా మూడుసార్లు తినిపించిన తరువాత నాలుగోసారి చేతితో అన్నాన్ని తినిపించవలెను. తరువాత తల్లి, మేనమామ మిగతా కుటుంబ పెద్దలు అదే పద్ధతిలో చేయాలి.

జీవికా పరీక్ష

అన్నప్రాశన సమయంలో దేవుని సన్నిధిలో బంగారు నగలు, డబ్బు, పుస్తకము, పెన్ను, కత్తి, పూలు, కలము, ఆయుధము, మొదలైన వస్తువులు పెట్టి శిశువును వస్తువులకు దగ్గరగా కూర్చోబెడతారు. అమర్చిన వస్తువులలో శిశువు మొదటిసారిగా వస్తువు తాకునో వస్తువుతో సంబంధమైన జీవనోపాధి శిశువుకు ఉంటుందని భావన చెందుట ఒక సాంప్రదాయంగా వస్తుంది.

అన్నప్రాశన ఎక్కడ చేయాలి

అన్నప్రాశన కార్యక్రమం దేవుడి గుడిలో లేదా శిశువు యొక్క అమ్మమ్మ గృహములో కానీ చేయాలి.

 

 

Also Read : నిష్క్రమణ

Leave A Reply

Your Email Id will not be published!