అక్షరాభ్యాసం

Aksharabhyasam

Telugu Tradition : Aksharabhyasam – బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు

నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్పటం. సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యా రంభమనీ అంటారు. సాధారణంగా సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడో ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ అయిన వెంటనే చేయాలని నిర్దేశించారు.

 



అక్షరాభ్యాసము ఎప్పుడు చేయాలి?

శిశువునకు 5 సంవత్సరములో అక్షరాభ్యాసము చేయాలి. ఉత్తరాయణముఅనగా మాఘము, ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము అక్షరాభ్యాసము చేయుటకు మంచి నెలలు, సూర్యుడు కుంభరాశిలో నున్నప్పుడు చేయరాదు.

శుక్ల పక్షము మంచిది. కృష్ణ పక్షము, అమావాస్య, దానిముందు 3 తిథులు అనగా కృష్ణ పక్ష ద్వాదశి, త్రయోదశి, చతుర్దశులు మరియు కృష్ణపక్షపాడ్యమి మంచివి కావు. అశ్విని, మృగశిర, పుష్యమి, పునర్వసు, ఆరుద్ర, ఆశ్లేష, హస్త, చిత్త, స్వాతి, మూల, శ్రవణ, రేవతి నక్షత్రములు మేష, కర్కా, తుల, మఖ, మీన లగ్నములు; ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారములు మంచివి. అనధ్యాయరహితమై అష్టమ శుద్ధి కల్గి ఉండవలెను.

అక్షరాభ్యాస విధానము

అక్షరాభ్యాసము చేయు బాబు, లేక పాప చేత ముందుగా విఘ్నే శ్వరుని, లక్ష్మీ నారాయణులను, సరస్వతిని, భూదేవిని తన కులదేవత లను, గురువునీ, బ్రాహ్మణులని పూజించి, నమస్కరించి, వారందరికి 3 సార్లు ప్రదక్షిణము చేయించవలెను. తూర్పు ముఖముగా శిశువును కూర్చుండబెట్టి ముందుగాఓంకారమును వ్రాయించి, తరువాత అక్షరములు వ్రాయించవలెను. తరువాత గురువునకు నమస్కారము పెట్టించవలెను.

అక్షరాభ్యాసానికి అనుకూలమైన పర్వదినాలు

పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వ దినాలలో కార్యక్రమం చేయటంవల్ల దేవతల ఆశీస్సులూ అను గ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.

సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది.

కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరా భ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలో గానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో కార్యక్రమం నిర్వ హించవచ్చు.

మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరా భ్యాసం నాడు దేవతలను పూజించి విద్యార్థి చేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి కార్యక్రమాన్ని ప్రారం భిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యా దేవతలుగా పూజిస్తారు.

తరువాతఓం నమః శివాయః సిద్ధం నమఃఅనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టినమశ్శివాయఅక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. అంతేగాక భాషకు వ్యాకరణం ఇచ్చినది పరమ శివుడు. కాబట్టి శివనామంతో అక్షరాన్ని ప్రారంభించాలి అని చెబుతారు. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్ని చోట్ల ఉంది. చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థంగా చెబుతారు.

సంప్రదాయ దుస్తులతో ముఖ్యంగా తెల్లని రంగు వస్త్రాలతో అమ్మ వారి దగ్గర అక్షరాభాస్యం చేసుకుంటే చాలు అమ్మ పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని కొందరి భావన. పిల్లలతో ఓం నమో సరస్వత్యేనమః అని నామాన్ని లేదా శారదా దేవ్యై నమః అని పారాయణాన్ని చేయించి నచో విశేష ఫలితం ఉంటుంది అని పెద్దల భావన.

 

Also Read : భోగిపండ్లు

Leave A Reply

Your Email Id will not be published!