గుజ్జన గూళ్ళు

Gujjana Gullu

Telugu Traditional Games : Gujjana Gullu –

ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట. బువ్వాలాట అని కూడా పిలువబడే ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును. పిల్లలు తమ పెద్దలనడిగి బియ్యము, పప్పులు, మరమరాలు, బెల్లం, పంచదార తెచ్చుకొని తాము ఆడుకొని లక్కపిడతల్లో పోసి వాటిని పొయ్యి మీద పెట్టినట్లు, దించినట్లు నటిస్తూ కొంత సేపటికి అందరూ కలిసి తింటారు. ఆట ఆడినప్పుడు బొమ్మల పెళ్ళి చేసి రెండు జట్లుగా చీలి వియ్యాల వారికి విందు పెట్టుటకై గుజ్జనగూళ్ళు పెట్టుదురు.



బాగుగా పండిన చింతకాయలను తెచ్చి నేర్పుతో దానిలోని గుజ్జును గుల్ల చెడకుండా వుండునట్లు పూర్తిగా తీసివేసి, గుల్లలో బియ్యము పోసి, దానిని మండు చున్న పొయ్యిలోని కుమ్ములోని పెట్టి అవి ఉడికిన తరువాత పిల్లలు గుజ్జన గూళ్ళు అని వేడుకగా తిందురు.

గుజ్జన గూళ్ళు ఆటను రుక్మిణి, గరిక ఆడినట్లు భాగవతంలోను, మనుచరిత్రలోను వ్రాయబడి ఉన్నది.
పూర్తిగా అంతరించిపోతున్న ఆట

ఆధునిక విద్య, ఆధునిక ఆటలు, ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం వల్ల ఆట నేడు దాదాపు పూర్తిగా అంతరించిపోయినది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలిపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికీ బువ్వాలట సామాన్లను విశాఖపట్నం జిల్లా ఏటికొప్పక గ్రామం వారు తయారుచేస్తారు. బువ్వాలట సామాన్లు నగరాల్లో జరిగే హస్త కళా ప్రదర్శనల్లో కూడా అమ్ముతుంటారు.

Read More : ఒంగు దూకుళ్ళు

Leave A Reply

Your Email Id will not be published!