చెమ్మ చెక్క – చారడేసి మొగ్గ

Chemma Chekka Charadesi Mogga

Telugu Traditional Game : Chemma Chekka Charadesi Mogga –

చెమ్మచెక్క అనే ఆట ఆడపిల్లలు ఆడుకునే ఆట. ఆట ఆడుటకు ఇద్దరు కాని ముగ్గురు కాని నలుగురు కాని పిల్లలు కావలెను. ఇద్దరు బాలికలు చదునైన చోట ఎదురె దురుగ నిలుచుండి చేతులను తట్టుచు బారలు చాచుచు క్రింది పాట పాడుచు, పాట లయకనుగుణముగ అడుగులు వేయుచు, చిందులు తొక్కుచు ఆడుచుందురు. చెమ్మచెక్క చేరడేసి మొగ్గ అట్లు పోయంగ, ఆరగించంగ రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగ పగడాల చెమ్మచెక్క పందిరేయంగ పందిట్లో మాబావ పెళ్ళి చేయంగ సుబ్బారాయుడి పెండ్లి, చూచి వత్తాము రండి అమ్మల్లారా, అక్కల్లారా పోయివత్తాము రా రండి మా వాళ్లింట్లో పెండ్లి, మళ్ళీ వద్దాం రండి, దొరగారింట్లో పెండ్లి, దోచుకువద్దాం రండి. అని పాడుతూ ఒకరి చేతులను ఒకరు తాకుతూ సంతోషంతో ఆడతారు. సర్కారు జిల్లాలలో, రాయలసీమలో పాడే పాట దీనికి కొంచెము భిన్నముగా ఉండును.



మొదటి చరణమైనచెమ్మ చెక్కఅనునపుడు బాలికలు దగ్గరగ ఎదురెదురుగా నిల్చుండి ఒకశ్లోకళ్ళు చేతులు తట్టు కొనవలెను. ‘చేరడేసి మొగ్గఅనునపుడు కాళ్ళతో వెనుకకు ఒక చిందు వేయుచు అదే సమయ మున చేతులు బారలు చాపవలెను. ఇట్లే మరల ఇంకొక చరణము పాడుచు మరల బాలికలు దగ్గరకు చిందువేసి ఒకళ్ళా కళ్ళు చేతులు తట్టుకొన వలెను. మరల ఇంకొక చరణము పాడుచు దూరము వెళ్ళి బారలు చాపవలెను. బాలికలు వేయు చిందులు పాట యొక్క లయను అనుసరించి ఉండవలెను. తెలుగు దేశమునంతటను ఆటకు పాటనే పాడుదురు. ఆటకు పైన తెలిపిన పాటే ప్రాణము. కొన్ని ప్రాంతాలలో మధ్య మధ్య, ఒకరి కొకరు ప్రశ్నకు సమాధానంగా ఇలా ప్రారంభిస్తారు.

 

ధిమితధిమిత ఏమి ధిమిత? పసుపు ధిమిత ఏమి పశుపు? తోట పసుపు ఏమి తోట? ఆకుతోట? ఏమి ఆకు? తమలపాకు ఏమి తమ్మ? పుట్ట తమ్మ. ఏమి పుట్ట? పాము పుట్ట ఏమి పాము? త్రాసు పాము 

బాలిక లందరూ ఇలా పాడుతూ వుంటే బాలురు మరో గమ్మత్తు పాట పాడుతారు.
ఏమి త్రాచు? నల్లత్రాచు.
భూమికి తాళం వేస్తేరంగా భోగందానికిసవరం దొరికె సవరం బట్టుకెళ్ళి సాని కిస్తే మామ నాకు పిల్లనిచ్చే పిల్ల పేరు మల్లిమొగ్గ నా పేరు జమీందార్. –
సాని నాకు జాబులు ఇస్తే
జాబులు పట్టు కెళ్ళి మామ కిస్తే

 

Read More : తొక్కుడుబిళ్ల

Leave A Reply

Your Email Id will not be published!