Telugu Marriage Tradition : Removing the Rings –
‘ఉంగరాలు తీయడం‘ దీనినే ‘ప్రధానాంగుళీయకం‘ అంటారు. మూతి చిన్నదిగా ఉండే బిందెలో పాలు, నీళ్లూ కలిపి నిండా పోస్తారు. ఆ బిందెలో ఒకే ఒక్క బంగారపు ఉంగరాన్ని వేస్తారు. పురోహితుడు చెప్ప గానే వధూవరులిద్దరూ గభాల్న ఆ బిందెలోకి చేతిని తోసి నీళ్లలో పడిన ఉంగరాన్ని వెలికి తీయాలి.
ఎవరి చేతికి చిక్కితే వారికి ఎదుటివారు ఆ ఉంగరాన్ని వేలికి తొడగాలి. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహి త్యాన్ని తెలియ చేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమిత్రుల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.