లగ్న పత్రిక వివరణ
Lagna Pathrika Vivarana
Telugu Marriage Tradition : Lagna Pathrika Vivarana – ఆరు అంగుళముల వెడల్పు పన్నెండు అంగుళముల పొడవు గల రాగిరేకు పై లగ్నపత్రికను వ్రాసి ఒక రాగి పాత్రలో గాని, మట్టి పాత్రలో గాని నీటిని నింపి దానిలో ఆ లగ్న పత్రికను ఉంచి ఆ లగ్న పత్రికను ఈ క్రింది విధంగా ప్రార్థించాలి.
ముఖ్యం త్వమసియంత్రాణాం బ్రహ్మణా నిర్మితం పురా |
భవ భావాయ దాంపత్యోః కాలసాధన కారణమ్ ||
ఓ యంత్ర రాజమా! నిన్ను పూర్వము బ్రహ్మదేవుడు నిర్మించెను. యంత్రములలో ప్రధానమైనదానవు. వారి అన్యోన్యతకు, దాంపత్య జీవన యాత్రలో ఒడుదుడుకులు లేకుండ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగజేసే దానివిగా ఆ దంపతుల పరస్పర ప్రేమకు కారణమగుదువు గాక. కొంతకాలం క్రితం లగ్న వివరములను ఇంటిలో గోడకు పసుపు, కుంకుమల మిశ్రమముతో వ్రాయుట ఆచారముగా కూడా కనిపించుచున్నది.