ముదిమనవల సంతానము అయితే
Grand Children's Offspring
TeluguTradition : Grand Children’s Offspring – ఈ బారసాల నాల్గవ తరము వారిది అయితే శుభకార్యం పూర్తి అయిన తరువాత మనుమడు, మనుమని భార్య ఈ ఇద్దరు దంపతులు, తాతకు, నాన్నమ్మకు పాద పూజచేసి వారికి నూతన వస్త్రాలు పెట్టాలి.
ఆ వస్త్రములు కట్టుకుని ఆ దంపతులు ముదిమనవనికి బంగారు ఉగ్గుగిన్నెతో పాలు తాగించాలి. పుట్టిన బాబుతో తోటకూర గింజలు అతని చేతిలో ఉంచి మట్టిలో చల్లించాలి.
ఆ మట్టిని ఇంటికి తీసుకువెళ్ళి కుంపటిలో వేసిన తోటకూర వస్తుంది. ముది మనుమని ఎత్తుకుని వృద్ధ దంపతులు మూడు గుమ్మాలు దాటవలెను.
తోటకూర మొక్కలు మొలచి ఆకులు వచ్చిన తరువాత దానిని వండి ముదిమనవని చేతిమీదుగా పళ్ళెములో పెట్టించుకుని తినవలెను. నానమ్మ తాతయ్య ఇద్దరు ఉన్నా వీరిలో ఏ ఒక్కరు ఉన్నా కూడా ఈ శుభకార్యం వేడుకలు జరుపుకొనవచ్చును.