మరదలు మాడ వేడుక

Mardalu Maada Veduka

Marriage Traditions :  పూర్వము స్త్రీలు ధరించే బంగారు ఆభరణాలలో మాడ అనేది ఒక బంగారపు ఆభరణము. పెళ్ళిలో పెళ్ళికుమార్తెకు మాడ అనే ఆభరణం కూడా పెట్టి అలంకరించేవారు. ఆనాటి వేడుకలలో బంగారపు మాడను బావ, వదిన వరసలు అయినటువంటి వారు పెళ్ళికుమార్తెకు తెలియకుండా దాచి ఆమెను ఆటపట్టించేవారు.

 

 

 

 

వేడుక ఈనాడు విధంగా మార్పు చెందింది. పెండ్లికుమార్తె అక్కచెల్లెళ్ళు కానీ, అన్నతమ్ముళ్లు గానీ పెళ్లి కుమార్తెను ఒక గదిలో దాస్తారు. వరుడు తన భార్యను వెదికి ఎక్కడ ఉందో తెలుసు కోవాలి. సందర్భంగా బావగారికి నూతన వస్త్రాలు పెట్టి భార్యతో ఆనందంగా నడుస్తారు. ఇది బావమరదుల మధ్య అనుబంధం ఏర్పడటానికి వేడుక ఏర్పాటు చేసారు.

 

Also Read : నలుగు వేడుక 

Leave A Reply

Your Email Id will not be published!